వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ స్టూడియో కట్టే యోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని విధాలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్, దగ్గుబాటి కుటుంబాల్లా స్టూడియో మాత్రం నిర్మించలేదు.
ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చుకునేందుకే చిరు విశాఖలో అన్ని వసతులతో కూడిన బ్రహ్మాండమైన స్టూడియో నిర్మించాలని భావిస్తున్నారట. ఈ మేరకు పనులు కూడ మొదలయ్యాయని అంటున్నారు. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియాలో నగర్లో చక్కర్లు కొడుతున్నా మెగా ఫ్యామిలీ ఈ వార్తలుపై ఏ విధంగానూ స్పందించలేదు. ఇకపోతే హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఇప్పటికే విశాఖలో స్టూడియో పనులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.