HomeTelugu Newsవెంకటేష్.. దుల్కర్.. ఓ మల్టీస్టారర్‌..?

వెంకటేష్.. దుల్కర్.. ఓ మల్టీస్టారర్‌..?

ప్రముఖ హీరో వెంకటేష్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ‘మహానటి’ చిత్రంతో దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో జెమిని గణేశన్‌గా దుల్కర్ నటన తీరు అందర్నీ ఆకట్టుకుంది. కాగా ఆయన తెలుగులో రెండో ప్రాజెక్టుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. వార్‌ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మరో కథానాయకుడిగా సందడి చేయనున్నారని సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఇద్దరినీ కలిసి స్క్రిప్ట్‌ నరేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు.

3 3

వెంకటేశ్‌ ప్రస్తుతం f2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ మరో కథానాయకుడు. దుల్కర్‌ ఇటీవల కర్వా సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu