కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం విశ్వరూపం -2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటంతో ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్ హాసన్.. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.