కమల్ హాసన్ కథానాయకుడిగా చేస్తూ.. స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం2 . వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమాను చివరిగా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరి ఆ అంచనాలను ఈ విశ్వరూపం 2 అందుకుందా ? కమల్ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించాడా ?మరోసారి దర్శకుడిగా ఆకట్టుకున్నారా..?
కథ: విశ్వరూపం తొలి భాగానికి పూర్తి స్థాయి కొనసాగింపుగా విశ్వరూపం 2 కథను తయారు చేసుకున్నారు కమల్ హాసన్. పూర్తిగా విశ్వరూపంతో లింక్ ఉండటంతో ఈ సినిమా చూసినవారికే విశ్వరూపం 2 పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. కమల్ ఓ మిషన్ పని మీద లండన్ వెళ్తాడు. లండన్‌లో భారీ విధ్వంసాని జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి చేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్ నుంచి తప్పించుకున్న అల్ ఖైధా తీవ్రవాది ఒమర్ ఖురేషీ (రాహుల్ బోస్) ఇండియాలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తాడు. యూకే సముద్ర అంతర్భాగంలో ఒక నావలో ఉన్న బాంబుల్ని పేలకుండా అడ్డుకోవడంతో పాటు, ఒమర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు అన్నదే విశ్వరూపం 2.
నటీనటులు : కమల్ హాసన్ అభినయం ఆకట్టుకుంటుంది. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఆ ఆయన బాడీ లాంగ్వేంజ్, డైలాగ్ డెలివరీ నిజంగా ఓ ‘రా’ ఏజెంట్‌నే చూస్తున్నామా అన్నంత సహజంగా సాగుతాయి. ఈ సినిమాలో ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్, ఆండ్రియాలకు రెండు భాగంలోనూ ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టారు సినిమాకి కావల్సిన గ్లామర్‌నీ అందించారు. విలన్‌గా రాహుల్ బోస్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో శేఖర్ కపూర్, జైదీప్, వాహీదా రెహమాన్ తమ పాత్రకు న్యాయం చేశారు.
విశ్లేషణ: కమల్ హాసన్ నటన పరంగానే కాకుండా నిర్మాతగానూ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు. విశ్వరూపం 2కు ఓ రూపు తీసుకురావటంతో ఎడిటర్లు మహేష్ నారాయణ్, విజయ్ శంకర్‌ల కష్టం చాలా ఉంది. ఎక్కవుగా తొలి భాగానికి సంబంధించిన సీన్స్‌ను రిపీట్ చేస్తూ రూపొందించిన స్క్రీన్‌ప్లేకు తగ్గట్టుగా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు ఎడిటర్లు. యూకే నేపథ్యంలో ఈ కథ ప్రారంభంమౌతుంది. కమల్ గూఢచారిగా ఎలా మారాడు? ఎలా తిరిగొచ్చాడనే విషయాలు ఫ్లాష్‌బ్యాక్‌గా వస్తాయి. ఆ తర్వాత యూకేలోనే విసామ్‌పై హత్యాయత్నం జరుగుతుంది. అక్కడ తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అప్పటిదాకా నెమ్మాదిగా సాగినట్టుగా అనిపింస్తుంది. ఆ తరువాత కొంచెం పట్టాలెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ భాగం తర్వాత కథ ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే వచ్చి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ‘రా’ అధికారులకు, కమల్‌హాసన్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. చెప్పడానికి కథేమీ లేకపోవడంతో సంభాషణలతో సన్నివేశాల్ని సాగదీసినట్లు అనిపిస్తుంది. సడన్‌గా యూకేలో బాంబు పేలుడు జరగకుండా ఓ యాక్షన్ ఎపిసోడ్ మొదలవుతుంది. దాంతో సినిమాకి విరామం బ్రేక్ పడిపోతుంది. ఆ తర్వాత కథ ఢిల్లీకి మారుతుంది. తల్లీ, కొడుకుల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. ఆ తర్వాత ఖురేషీ గ్యాంగ్, విసామ్ మధ్య యుద్ధం మొదలవుతుంది. విసామ్‌కు కాబోయే భార్య నిరుపమను, తల్లిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ నుంచి వాళ్లని ఎలా రక్షించాడు? ఖురేషినీ ఎలా అంతం చేశాడు? ఇండియాలో 64 చోట్ల పెట్టిన బాంబుల్ని కూడా పేలకుండా ఎలా అడ్డుకున్నాడనే విషయాలతో శుభం కార్డు పడుతుంది. సంగీత దర్శకుడు గిబ్రాన్ ఓ స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గ కుండా అంతర్జాతీయ స్థాయి సంగీతమందించాడు. సినిమాటోగ్రఫి కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. అయితే అక్కడక్కడ గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉండి ఇబ్బంది పెడతాయి. కమల్ నిర్మాతగానూ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు.
హైలైట్స్
నటీనటులు
యాక్షన్ సీన్స్
డ్రాబ్యాక్స్
తొలి భాగం
కొన్ని సన్నివేశాల్ని సాగదీవడం
చివరిగా : కథలో ‘విశ్వరూపం’ చూపలేకపోయాడు.
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
సినిమా : విశ్వరూపం 2
నటీనటులు : కమల్ హాసన్, శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా
దర్శకత్వం : కమల్ హాసన్
నిర్మాతలు: కమల్ హాసన్, చంద్ర హాసన్
సంగీతం : గిబ్రాన్