శాండల్‌వుడ్ హీరోయిన్ నిధి సుబ్బయ్య తన సోషల్ మీడియాలో ఒక ఫోటో చేసి వివాదంలో చిక్కుకుంది..ఇటీవల ఆమె మైసూర్ వెళ్లిన సమయంలో మైసూర్ ప్యాలెస్ లో కొద్దిసేపు సేదతీరిన నిధి సుబ్బయ్య నిషేదిత ప్రాంతంలో ఫోటో దిగింది.. ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . నిషేదిత ప్రాంతం అంటారు అలాంటిది హీరోయిన్ నిధి కి ఫోటో దిగడానికి , ఫోటో షూట్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఆమె వివరణ ఇస్తూ, నేను ఎలాంటి తప్పు చేయలేదని , అందరి వీక్షకుల లాగే నేను కూడా కామన్ ఫోటో దిగాను కానీ అక్కడ ఫోటో షూట్ ఏమి చేయలేదు అంటూ గట్టిగానే చెబుతోంది . ఇక మైసూర్ ప్యాలెస్ అధికారులు కూడా అది నిషేదిత స్థలం కాదని కాకపోతే దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే అక్కడకు ఎవరినీ రాకుండా నిషేధం విధిస్తామని , అంతేకాని మిగతా సమయాల్లో మామూలుగానే ఉంటుందని భద్రతా అధికారి ఏసీపీ శైలేంద్ర వివరణ ఇచ్చారు.