మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు అయినప్పటికీ ఆ పేరు వాడుకోకుండా సొంతంగా పైకి ఎదిగాడన్న పేరు దుల్కర్‌కు ఉంది. తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్‌కు ఒక్క మాలీవుడ్‌లోనే కాదు.. మిగతా దక్షిణాది భాషల్లోనూ క్రేజ్ సంపాదించాడు. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ మహానటితో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో అరంగేట్రం కోసం తండ్రి సహకారం తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ‘కార్వాన్’ చిత్రం ద్వారా దుల్కర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని రోన్ని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం మమ్ముట్టితో నిర్మాత పలుమార్లు చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. కొడుకు బాలీవుడ్ ఎంట్రీ కోసం మమ్ముట్టి స్వయంగా రంగంలోకి దిగారని, ప్రమోషన్ల విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై దుల్కర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఆ వార్త నిజం కాదని.. నా కెరీర్ ప్రారంభం నుంచి ఏ చిత్రం విషయంలోనూ నా తండ్రి జోక్యం చేసుకోలేదని, ఏ సినిమాను కూడా ప్రమోట్ కూడా చేయలేదని వివరణ ఇచ్చాడు. అది అలాగే కొనసాగుతుందని అన్నాడు.