ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను వివాహమాడబోతున్నాడు. . భక్తి గీతాలతో గాయనిగా పూజాప్రసాద్ గుర్తింపు పొందారు. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. నిశ్చితార్థానికి హాజరైన ‘బాహుబలి’ నిర్మాత శోభ యార్లగడ్డ వారిద్దరితో ఉన్న చిత్రాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వివాహం ఎప్పుడు? ఎక్కడ వంటి వివరాలు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.