యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పెట్టాడు విజయ్. రేపు (గురువారం) సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతున్న సందర్భంగా పోలింగ్ నిర్వహించారు.
అందులో విజయ్ దేవరకొండ ఎవరు? a)రౌడీ b)రాజకీయవేత్త c)లీడర్ d)నోటా అని ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటివరకు దాదాపు 4000 మందికిపైగా ఓటింగ్ చేశారు. ఈ పోల్ రేపటివరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. సినిమాను ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నందుకు విజయ్‌ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘సినిమా ప్రచార కార్యక్రమాలు నీకంటే బాగా ఎవ్వరూ చేయలేరు భయ్యా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘నోటా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. . తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు విజయ్ ట్యాక్సీవాలా చిత్రంతోనూ బిజీగా ఉన్నారు.