కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్నాడు. విజయ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.తమిళ్‌లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాకు తెలుగులో ‘రోషగాడు’ అన్న టైటిల్ తో రానుంది.
కాగా ఈ రోజు సాయంత్రం ‘రోషగాడు’ సినిమా మోషన్ టీజర్ విడుదలయింది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని పోలీస్ ఆఫీసర్ K. కుమారస్వామి పాత్రలో కనిపించానున్నాడు. ఈ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు.