పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆయన మకాం విజయవాడకు మార్చారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని పటమటలంకలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పూజలు చేసి ఆ ఇంట్లో దిగారు. అయితే విజయవాడలోని ఓ హోటల్‌లో పవన్‌తోపాటు ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వీరి ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది నెటిజన్లు ట్విటర్‌లో అకీరా విజయవాడకు రావడం గురించి రేణును ప్రశ్నించారట. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు.
“అకీరా తన సెలవుల్లో కొన్ని రోజులు తండ్రితో గడుపుతున్నాడు. అతడు హైదరాబాద్‌కు పూర్తిగా వచ్చేయలేదు. కల్యాణ్ గారితో కలిసి అకీరా విజయవాడలో ఉండటంతో నిన్నటి నుంచి నాకు విరామం లేకుండా సందేశాలు వస్తున్నాయి. అందుకే ఈ ట్వీట్ చేశానని రేణు పేర్కొన్నారు. పవన్‌తో డైవర్స్ అయ్యాక రేణు దేశాయ్ అకీరాతో పుణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. రేణు ఇటీవల విహారయాత్ర నిమిత్తం తన కుటుంబ సభ్యులతో కలిసి గోవా వెళ్లారు. ఇటీవల తనకు ఓ తోడు దొరికినట్లు, ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను అభిమానులకు షేర్ చేసి , రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది.