ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. ధృవ్ కారు రోడ్డు పక్కనే నిలబెట్టి ఉన్న మూడు ఆటోల మీదికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడగా ధృవ్ విక్రమ్ కు ఎలాంటి అపాయం కలుగలేదట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఇకపోతే ధృవ్ తెలుగు సూపర్ హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ తో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘వర్మ’గా ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తూ ధ్రువ్ ఈ మేరకు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. కారు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ధ్రువ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు.