HomeTelugu Big Storiesవాజ్‌పేయీ మృతి సినీ ప్రముఖుల సంతాపం

వాజ్‌పేయీ మృతి సినీ ప్రముఖుల సంతాపం

అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతితో దేశం ఒక మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను 2000 సంవత్సరం జూన్ 22న వాజ్‌పేయీ గారి చేతులమీదుగానే ప్రారంభించాం. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్థుడు. ఆయన విధివిధానాలు పలువురికి ఆదర్శంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఫొటోలను పంచుకున్నారు.

11a 1

వాజ్‌పేయీ జీ ఇకలేరన్న వార్త వినడం చాలా విచారంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి -రజనీకాంత్‌

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మహాభినిష్క్రమణ భారతదేశానికి తీరని లోటు. ఆయన మన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిది. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. రాజకీయ భీష్ముడిగా కీర్తిని అందుకున్న వాజ్‌పేయీ చిరస్మరణీయుడు. -జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

రాజకీయాలకు వన్నెతెచ్చిన అతికొద్దిమంది రాజనీతిజ్ఞుల్లో వాజ్‌పేయీ ఒకరు. రహదారుల అనుసంధానం అనే ఆయన విజన్‌ దేశంలో బతుకుతున్న లక్షలాదిమంది జీవితాలను మార్చివేసింది. నా ప్రియమైన లీడర్‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నా -ఎస్‌.ఎస్‌.రాజమౌళి

11 10

ఓ నిస్వార్థమైన రాజకీయ నాయకుడు
వాజ్‌పేయీగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజ్‌పేయీగారు కలిసి పనిచేశాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజ్‌పేయీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాథుని కోరుకొంటున్నాను. – సినీనటుడు, మోహన్ బాబు

మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప నాయకుల్లో ఒకరైన వాజ్‌పేయీకి సెల్యూట్‌. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడికి సెల్యూట్‌. అసమాన రాజనీతిజ్ఞుడు, ధైర్యశాలి. ఆయన విజన్‌ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ చక్కగా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి. అటల్‌జీ మన గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు -జూనియర్‌ ఎన్టీఆర్‌

దేశం ఎప్పుడూ చూడని ఓ గొప్ప ప్రధాని వాజ్‌పేయీ. ఆయన జీవితాంతం దేశ శ్రేయస్సు కోసం శ్రమించారు. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో ఉంటారు – సినీనటుడు మోహన్‌ లాల్‌.

ఈరోజు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం. భారత్‌ వెలిగిపోవడానికి నిత్యం కలలు కన్న మహోన్నత వ్యక్తి. మనల్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి-రానా దగ్గుబాటి

Recent Articles English

Gallery

Recent Articles Telugu