HomeTelugu Newsవరుణ్‌ తేజ్‌ 'అంతరిక్షం' ఫస్ట్‌లుక్‌

వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ ఫస్ట్‌లుక్‌

మెగా వరసుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ కొత్త కాన్సెఫ్ట్‌తో సినిమా రాబోతోంది. ఈ సినిమాకి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 9000 కేఎంపీహెచ్‌ అన్నది ఉప శీర్షిక. వ్యోమగామిగా వరుణ్‌ ఏదో పరిశీలిస్తున్నట్లుగా కన్పిస్తున్న ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది.

2 15

ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. గతేడాది ‘ఘాజీ’తో సముద్ర గర్భంలో జరిగిన యుద్ధాన్ని అద్భుతంగా తెరపై చూపించిన సంకల్ప్‌రెడ్డి ఈసారి అంతరిక్షంలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం వరుణ్‌, అదితిరావ్‌లను త్రీడీ స్కానింగ్‌ కూడా చేశారని సమాచారం. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఇందులో పెద్ద పీట వేశారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ డిసెంబర్‌ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu