ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోల మధ్య, డైరెక్టర్ల మధ్య స్నేహబంధం వెల్లివిరుస్తోంది. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులందరూ ఒక చోట చేరారు…అందరూ కలసి తమతమ అనుభవాలను, అభిప్రాయాలను ఇతర దర్శకులతో పంచుకున్నారు.. దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి ఓ పార్టీని నిర్వహించగా, ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు.
వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వంశీ పైడిపల్లి, “అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను” అని క్యాప్షన్ కూడా పెట్టారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలని వంశీ వ్యాఖ్యానించాడు.