టాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన రామ్ కు గత కొంతకాలంగా సరైన హిట్ లభించక డీలా పడ్డాడు. ఎన్నో ఆసలు పెట్టుకొని నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా కూడా నిరాస పరిచింది. దీంతో ప్రయోగాలను, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి తనకు కలిసొచ్చే ప్రేమకథలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో వరుస కమర్షియల్ విజయాలను అందుకుంటోన్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో సినిమా చేయబోతున్నాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ వంటి చిత్రాలతో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు త్రినాధరావు. మామ-అల్లుళ్ళ కాన్సెప్ట్ లను సరికొత్తగా తెరకెక్కించి సక్సెస్ లు అందుకుంటున్నాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు రచయిత ప్రసన్నతో కలిసి వర్క్ చేస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. దాదాపు ఈ సినిమాకు మొత్తం ‘నేను లోకల్’ సినిమాకు పని చేసిన చిత్రబృందం పని చేస్తుండడం విశేషం. దిల్ రాజు తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16నుండి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది.