Homeతెలుగు Newsరేపు గుంటూరులో 'నారా హమారా.. టీడీపీ హమారా' సదస్సు

రేపు గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సదస్సు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు (మంగళవారం) గుంటూరులో ముస్లిం మైనార్టీ సదస్సు ‘నారా హమారా.. టీడీపీ హమారా’ నిర్వహించనున్నారు. సదస్సు ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పరిశీలించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని రీతిలో ముస్లింలకు టీడీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించిందని రాష్ట్ర మంత్రులు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మతసామరస్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, టీడీపీ హయాంలో మత కలహాలు ఎప్పుడూ జరగలేదని కళా వెంకట్రావు అన్నారు.

13 11

ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ అమలు చేసిందన్నారు. కిందటి ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి గానీ వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రులు పుల్లారావు, ఆనందబాబు అన్నారు. బీజేపికు మద్దతిచ్చామన్న కారణంతో మైనార్టీలు దూరం జరిగినా.. టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించారని వారు అన్నారు. మోదీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న పోరాటాన్ని వారంతా స్వాగతిస్తున్నారని, పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని టీడీపీ మంత్రులు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu