దేశంలోనే అతిపెద్దదైన వేశ్యవాటికి ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతం. అనేక హిందీ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని రెడ్‌లైట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మొదటినుండి వైవిథ్యమైన కథా చిత్రాల్లో నటిస్తున్న శర్వానంద్ ఈ చిత్రంలో నటించనున్నారు.
స్వామిరారా, కేశవ వంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రయెగాత్మక చిత్రమైనప్పటికీ తెలుగులో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ నటిస్తారని తెలుస్తోంది. మిగతా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.