టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న నటి ‘ప్రణీత’. ఈ చిత్రం తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవంలో చేసింది. ఈ మూవీ ప్లాప్‌తో ఈ భామ కన్నడ సినీ రంగానికి వెళ్లిపోయింది. రెండేళ్ల విరామం తర్వాత రామ్‌తో కలిసి “హలో గురు ప్రేమ కోసమే” చిత్రంలో నటిస్తోంది.
తెలుగులో కొత్త సినిమాకు ఇంత గ్యాప్ రావడానికి కారణమేంటో చెప్పింది ప్రణీత. తెలుగులో తనకు నచ్చే స్ర్ర్కిప్టులు రాకపోవడం వల్లే ఇక్కడ సినిమా చేయకుండా..కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇన్నాళ్ల తర్వాత తనకు మంచి పాత్ర దొరకడంతో రామ్‌తో కలిసి నటించేందుకు రెడీ అయిందట ప్రణీత. ఈ చిత్రంతో తాను సిటీగర్ల్గా కనిపిస్తానని, ఈ పాత్ర కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.