Homeతెలుగు Newsరెండు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతపై చంద్రబాబు కీలక చర్చలు

రెండు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతపై చంద్రబాబు కీలక చర్చలు

వచ్చే ఎన్నికల్లో పార్టీ విధానం ఎలా ఉండాలి, ఏపార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలి, తెలంగాణలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి, జాతీయ స్థాయిలో పార్టీ విధానం ఏవిధంగా ఉండాలి ఈ విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు అతిపెద్ద చర్చకు తెరలేపారు. కీలక సమయంలో చంద్రబాబు కీలక చర్చకు తెరలేపారు. సీనియర్ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి నేతల వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఏపీలో పెద్దగా ఆలోచించే అవసరం లేకున్నా తెలంగాణ, జాతీయ స్థాయిలో పార్టీ వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో పార్టీ పటిష్ఠతపై చంద్రబాబు మేథోమథనం చేస్తున్నారు.

1 37

వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. తెలంగాణలో ముందస్తు మేఘాలు కమ్ముకొస్తుండటంతో జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో పార్టీ విధానం ఎలా ఉండాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. దీనికోసం రాజధానిలో మంగళవారం(22న) అందుబాటులో వున్న మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక మంతనాలు జరిపారు. ముఖ్యంగా ఏపీలో పరిణామాల దృష్ట్యా జాతీయ స్థాయిలో పార్టీ పటిష్టతకు ఎలా ముందుకెళ్లాలన్నదానిపై నేతల అభిప్రాయాలు సేకరించే పనిలో పడ్డారు.

1a

జాతీయ స్థాయిలో బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్న భావన టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసిన తర్వాత మోడీ గ్రాఫ్ పడిపోయిందనే ప్రస్తావనతో పాటు, రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారన్న అభిప్రాయం ఈ సమావేశంలో టీడీపీ నేతలు వ్యక్తపరిచినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీలో ఈ పరిణితి ప్రధాని అయ్యే వరకూ ఉంటుందా లేదా అని కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి అనుకూలంగా ఉండాలనే అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు పూర్తిగా ప్రత్యేక హోదా, విభజన సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. జాతీయ స్థాయిలో మోడీ ప్రభావం ఎంతమేరకు ఉంటుంది?, రాహుల్ ఏమైనా మ్యాజిక్ చేయగలరా? థర్డ్ ఫ్రంట్ పరిస్థితి ఏమిటనే అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇదే సందర్భంలో మమతా బెనర్జీ, మాయావతి వంటి వారు థర్డ్‌ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తూనే మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని కలుపుకుని వెళ్లాల్సిందేననే భావనలో ఉన్నారనే అభిప్రాయాన్ని ఒకరిద్దరు ఎంపీలు సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాలుంటాయని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

1b

తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తుండటంతో పార్టీ వైఖరిపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా కేడర్ మాత్రం అలాగే ఉందని చంద్రబాబు అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ వైఖరితో టీడీపీ సానుభూతిపరులు తెలంగాణ ఆంధ్రుల్లో మార్పు కనిపించిందని ఓ మంత్రి సమావేశంలో వెల్లడించినట్టు సమాచారం. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి అంశాల్లో ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యవహరించడం అవిశ్వాసం విషయంలో అంటీ అంటన్నట్టు వ్యవహరించడం వంటి పరిణామాలు తెలంగాణలో టీడీపీకి కలిసొచ్చే అంశమని విశ్లేషించినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీని ఏవిధంగా చక్కదిద్దాలి, తిరిగి పార్టీకి పూర్వవైభవం ఎలా తీసుకురావాలో తనకు తెలుసని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో నాలుగైదు భారీ బహిరంగ సభలు పెట్టాలనే ప్రస్తావన ఈ సమావేశంలో వచ్చినట్టు సమాచారం. అక్కడి రాజకీయ పరిణామాలపై టీటీడీపీ నేతలతో చర్చిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలైనా తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఉభయ తారకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు నేతలు సూచించినట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu