HomeTelugu Newsరివ్యూ: రా.. రా..

రివ్యూ: రా.. రా..

నటీనటులు: శ్రీకాంత్, నజియా, అలీ, షకలక శంకర్ తదితరులు
సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫీ: పూర్ణ
ఎడిటింగ్: శంకర్
నిర్మాత: విజే
ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నాడు. ‘యుద్ధం శరణం’ చిత్రంతో విలన్ గా కూడా మారాడు. తొలిసారి హారర్ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాంత్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
raa raa
కథ:
రాజ్ కిరణ్(శ్రీకాంత్) తన తండ్రి(గిరిబాబు) మాదిరి పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అయితే తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంటుంది. దీంతో అతడి తండ్రి గుండె ఆగి చనిపోతాడు. అది చూసి రాజ్ తల్లికి గుండెపోటు వస్తుంది. ఆమెను బ్రతికించుకోవడానికి తనకు సంతోషం కలిగే పని చేయాలని డాక్టర్ సలహా ఇస్తాడు. తల్లి సంతోషం కోసం ఒక హిట్టు సినిమా చేయాలనుకుంటాడు. దానికోసం ఓ పాడుబడ్డ బంగ్లాకు వెళ్తుంది రాజ్ అండ్ టీమ్. అక్కడే కథ సిద్ధం చేసి ఓ హారర్ సినిమా చేయాలనుకుంటాడు రాజ్. కానీ అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి వాటి నుండి రాజ్ అండ్ టీమ్ ఎలా తప్పించుకుంది..? అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తాడా..? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
పృధ్వీ కామెడీ ట్రాక్
మైనస్ పాయింట్స్:
కథ, కథనాలు
నటీనటుల పెర్ఫార్మన్స్
ఎడిటింగ్
విశ్లేషణ:
హారర్ అనేది సేఫ్ జోనర్ అని చెప్పొచ్చు. సక్సెస్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో హారర్, కామెడీ సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. కాబట్టి అదే జోనర్ ను నమ్ముకొని పలు సినిమాలు వస్తున్నాయి. సినిమాల కాన్సెప్ట్ ఒకటే ఉన్నప్పటికీ కాసింత నవ్వించి, భయపెడితే ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అయిపోతుంది. కానీ ఈ సినిమాలో అటువంటి అంశాలు లేకపోవడంతో
ప్రేక్షకులకు నిరాశకు గురి చేస్తుంది. శ్రీకాంత్ నటన అసలు ఆకట్టుకోదు. మిగిలిన నటీనటుల పరిస్థితి కూడా అంతే. టెక్నికల్ గా సినిమా మంరింత వీక్ గా ఉంది. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఆకట్టుకోవు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. దర్శకత్వంలో లోటుపాట్లు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
రేటింగ్: 1/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu

నటీనటులు: శ్రీకాంత్, నజియా, అలీ, షకలక శంకర్ తదితరులు సంగీతం: ర్యాప్ రాక్ షకీల్ సినిమాటోగ్రఫీ: పూర్ణ ఎడిటింగ్: శంకర్ నిర్మాత: విజే ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నాడు. 'యుద్ధం శరణం' చిత్రంతో విలన్ గా కూడా మారాడు. తొలిసారి హారర్ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాంత్. మరి ఈ సినిమా ప్రేక్షకులను...రివ్యూ: రా.. రా..