నటీనటులు: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి
సినిమాటోగ్రఫీ: రవియాదవ్
సంగీతం: రధన్
నిర్మాత: కిరణ్, సంజయ్
దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
మంజుల ఘట్టమనేని నిర్మాతగా, నటిగా మాత్రమే ఇప్పటివరకు తెలుసు. కానీ ‘మనసుకి నచ్చింది’
చిత్రంతో దర్శకురాలిగా మారింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు
ఆకట్టుకుందో తెలుసుకుందాం!
కథ:
సూరజ్(సందీప్ కిషన్), నిత్యా(అమైరా దస్తూర్) ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో
చిన్నప్పటినుండి స్నేహంగా మెలుగుతారు. వారి స్నేహాన్ని ప్రేమగా భావించిన కుటుంబసభ్యులు
ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. అయితే తమ మధ్య ఉన్న స్నేహం మాత్రమేనని పెళ్లిపీటల
నుండి ఈ జంట గోవాకు పారిపోతుంది. గోవాలో సూరజ్.. నిఖిత(త్రిదా)ను చూసి ఆమెను
ప్రేమిస్తాడు. నిత్య కూడా అభయ్(అదిత్) అనే వ్యక్తికి దగ్గరవుతుంది. ఇలా పెళ్లి చేసుకోవాల్సిన జంట
వేరే వాళ్ళను ఇష్టపడడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. చివరకి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారనేదే
కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
ఎడిటింగ్
విశ్లేషణ:
స్నేహం, ప్రేమ ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. దర్శకురాలు మంజుల కూడా అదే లైన్ ను ఎంపిక చేసుకుంది. ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు గల స్నేహితులు ప్రేమలో పడటం, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళడం ఇదే కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుంది. ఈ కథకు ప్రకృతి అనే కాన్సెప్ట్ ను జోడించి సినిమాగా తెరకెక్కించారు. కథలో కొత్తదనం లేకపోగా తన కథనం, సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా విసిగించింది మంజుల. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైంది. సెకండ్ హాఫ్ మరింత రొటీన్ గా సాగింది. పతాక సన్నివేశాలు చప్పగా సాగాయి. సందీప్ నటన ఏవరేజ్ గా ఉంది. ఇద్దరు అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పాటలు ఆహ్లాదకరంగా సాగాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 2/5