నటీనటులు: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: అధ్వైత గురుమూర్తి
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
నిర్మాతలు: రామ బ్రహ్మం సుంకర్, అనిల్ సుంకర
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
కథ:
కృష్ణ(నిఖిల్) కాలేజ్ స్టూడెంట్. స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివే సమయంలోనే ఫైనల్ ఇయర్ చదివే మీరా(సిమ్రన్) అనే అమ్మయిని ప్రేమిస్తాడు. కొన్నాళ్ళకు మీరా కూడా కృష్ణను ఇష్టపడుతుంది. కానీ ఊహించని విధంగా మీరా చనిపోతుంది. దీంతో ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉందే కృష్ణ రెబెల్ గా మారిపోతాడు. ఆ తరువాత సత్య(సంయుక్త హెగ్డే) అనే మరో అమ్మాయి కృష్ణను ప్రేమిస్తుంది. కానీ కృష్ణ మాత్రం మీరా జ్ఞాపకాల్లోనే బ్రతుకుతుంటాడు. మరి అతడు మామూలు మనిషి అవ్వగలిగాడా..? అసలు మీరా ఎలా చనిపోయింది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
నిఖిల్ నటన
కాలేజ్ లో సాగే సన్నివేశాలు
క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
సాగతీత
రొటీన్ స్టోరీ
విశ్లేషణ:
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కిరిక్ పార్టీ’కు రీమేక్ గా ఈ ‘కిరాక్ పార్టీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. మక్కీకి మక్కీ సినిమాను దించేసారు. దర్శకుడు శరన్ కొప్పిశెట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా తన ప్రతిభను ఉపయోగించకుండా సినిమాను కాపీ పేస్ట్ చేసినట్లుగా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా తెరపై సినిమాను ఆవిష్కరించారు. ఒరిజినల్ సినిమాను చూసిన వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ ను మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. నిఖిల్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. హీరోయిన్లు నటన, గ్లామర్ రెండింటిలో అలరించలేకపోయారు. సాంకేతికంగా సినిమా స్థాయి బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ మెప్పిస్తుంది. సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది.