నటీనటులు: కాజల్, నిత్యామీనన్, ఈషా, రెజీనా, శ్రీనివాస్ అవసరాల తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
నిర్మాత: నాని, ప్రశాంతి
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
‘అ!’ ఈ మధ్య కాలంలో ఆడియన్స్ లో హాట్ టాపిక్ అయిన సినిమా ఇది. యంగ్ హీరో నాని ఈ సినిమాను నిర్మించడం, స్టార్ కాస్ట్ సినిమాలో ఉండడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు సినిమా పోస్టర్లు మరిన్ని అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కలి(కాజల్) తన పుట్టినరోజు నాడే చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. రాధ(ఈషా) తను ప్రేమించిన కృష్ణవేణి(నిత్యామీనన్)ని పెద్దవాళ్ళకు పరిచయం చేస్తుంది. తమ కూతురు మరో అమ్మాయిని ప్రేమిస్తుందని తెలుసుకొని షాక్ అవుతారు. నలభీమ(ప్రియదర్శి) వంట రాకుండానే షెఫ్ గా జాయిన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అతడిని చేప, ఒక మొక్క సాహయం చేస్తుంటాయి. మీరా(రెజీనా) డ్రగ్ అడిక్ట్. వెయిట్రెస్ గా పనిచేస్తూనే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దొంగతనం చేయడానికి రెడీ అవుతుంది. శివ(శ్రీనివాస్ అవసరాల) సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. టైమ్ మెషేన్ కనుక్కొని తన తల్లితండ్రులను కలుసుకోవాలనుకుంటాడు. యోగి(మురళీశర్మ) తనో గొప్ప మెజీషియన్ అనుకుంటాడు. ఈ క్యారెక్టర్లన్నీ ఒక చోట ఉంటే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనేదే కథ.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
నటీనటులు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం
సెకండ్ హాఫ్ ల్యాగ్
విశ్లేషణ:
కథ ఆధారంగా నడిచే ఈ సినిమాకు స్టార్ కాస్ట్ తోడవ్వడం సినిమాకు ప్లస్ అయింది. సినిమా చూసిన వారెవరూ కూడా నిరాశ చెందరూ కానీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కూడా చెప్పలేని పరిస్థితి. ఒక మనిషిలో ఉండే వివిధ రకాల ఫీలింగ్స్ ను పాత్రల ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. తను చేసిన ఈ ప్రయోగాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎవరి నటనకు వంక పెట్టలేము. టెక్నికల్ గా ఈ సినిమాను మంచి క్వాలిటీతో తెరకెక్కించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.75/5