రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా ఈ ఆదివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని క్రాస్ రోడ్స్ థియేటర్లలో రంగస్థలం మూవీ బాహుబలి సినిమా రికార్డులను తిరగరాసింది. ”బాహుబలి -ది బిగినింగ్” ఫుల్ రన్ లో రూ. 2,04,75,067 వసూలు చేస్తే రంగస్థలం కేవలం 47 రోజుల్లో ఆరికార్డును బ్రేక్ చేస్తూ రూ. 2,04,79,180 వసూలు చేసింది. ఇతర రికార్డులు చూస్తే క్రాస్ రోడ్స్ లో కేవలం 4 రోజుల్లో బాహుబలి-2 రూ. కోటి వసూలు చేస్తే.. రంగస్థలం, బాహుబలి-1 చిత్రాలు 9 రోజుల్లో కోటి వసూలు చేశాయి. కేవలం బాహుబలి -2 చిత్రం 2 కోట్లు వసూలు చేస్తే ఆ రికార్డును రంగస్థలం 47 రోజుల్లో అందుకుంది. బాహుబలి-1 84 రోజుల్లో అందుకుంది.
ఇటీవలి కాలంలో సినిమాల రికార్డులని పరిశీలించేందుకు కొన్ని ప్రత్యేక ప్రమాణాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా మెట్రోనగరాలైన హైదరాబాద్, చెన్నైవంటి చోట్ల తెలుగు సినిమాలు మెజారిటీ స్క్రీన్లలో రిలీజై మంచి వసూళ్లతో అదరగొడుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అరడజను థియేటర్లలో అగ్ర హీరోల సినిమాల రిపోర్ట్ ని ట్రేడ్ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఓపెనింగుల నుంచి తొలివారం రికార్డులు, ఫుల్ రన్ రికార్డులను సక్సెస్ కి ప్రమాణంగా తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక సినిమా రికార్డుని మరో సినిమా బ్రేక్ చేస్తూ ట్రేడ్ ని, అభిమానులని ఉత్సాహపరుస్తోంది. వరుస విజయాలతో ఇదివరకెన్నడూ లేనంతగా టాలీవుడ్ ఇప్పుడు మంచి జోష్ మీదుంది.