HomeTelugu Big Storiesరాష్ట్రంలోని చిన్నారులందరికి సితార 'గ్రీన్ ఛాలెంజ్'

రాష్ట్రంలోని చిన్నారులందరికి సితార ‘గ్రీన్ ఛాలెంజ్’

‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా మొదలైన ‘గ్రీన్ ఛాలెంజ్’ ప్రోగ్రామ్ విజయవంతంగా మారింది. మహేష్ కుమార్తె సితార తన తండ్రి విసిరిన ‘గ్రీన్ ఛాలెంజ్’ను స్వీకంరిచిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలోని చిన్నారులంతా హరితహారం ‘గ్రీన్ ఛాలెంజ్’లో భాగస్వామ్యులు కావాలంటూ ఆమె చేసిన ఆలోచనకు జనం ఫిదా అవుతున్నారు.కాగా ఇటీవలే మంత్రి కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహేష్ బాబు చెట్లు నాటి.. అదే ఛాలెంజ్‌ని తన కూతురు సితారకు, కొడుకు గౌతమ్‌కి, డైరెక్టర్ వంశీ పైడిపెల్లికి విసిరారు. అయితే తాజాగా తన తండ్రి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన సితార.. తాను మొక్కలు నాటుతున్న ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ”భవిష్యత్ అంతా పచ్చదనంతో వర్ధిల్లాలని.. ఎంతో ఆదర్శవంతంగా తలపెట్టిన ఈ ప్రోగ్రామ్‌లో రాష్ట్రంలోని చిన్నారులందరినీ పాల్గొనాలని కోరుతున్నా” అని ట్యాగ్ చేసింది.

8

అయితే ఇప్పటివరకు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వారంతా మరో ముగ్గురికి మాత్రమే ఈ ఛాలెంజ్ విసురుతుంటే.. ఈ చిన్నారి సితార మాత్రం రాష్ట్రంలోని చిన్నారులందికీ ఆహ్వానం పంపటం నిజంగా గర్వించే విషయం అని సంబర పడుతున్నారు మహేష్ అభిమానులు. చిన్ని బుర్ర చేసిన ఈ గొప్ప ఆలోచన ఎన్నో చెట్లకు ప్రాణం పోయడానికి అవకాశం ఉంది. గౌతమ్ కూడా తమ ఇంటి వద్ద మొక్కలు నాటారు. ఈ ఇద్దరు చిన్నారులు మొక్కులు నాటుతున్న మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మహేష్ బాబు 25వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిచారు. తన వంతుగా మూడు మొక్కులు నాటారు. ఆయనతో పాటు వివి వినాయక్ లాంటి ప్రముఖులు సైతం మొక్కలు నాటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu