వైజాగ్‌కు చేరువగా ఉన్న కంచరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. కాగా రానా దగ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. నచ్చి తనే విడుదల చేయడానికి ముందుకొచ్చినట్లుగా ఈ మధ్య ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. రానా సురేశ్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సమర్పిస్తున్న చిత్రమిది. వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్థి సంగీతం అందిస్తున్నారు.
స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సుబ్బారావ్, రాధాబెస్సి, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు, కార్తిక్ రత్నం, విజయ ప్రవీణ, మోహన్ భగత్, ప్రణీత పట్నాయక్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు రానా ప్రకటించాడు. 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అన్నారు. ఇది ప్రతి ఒక్కరి తొలి ప్రేమను గుర్తు చేస్తుందని.. ప్రేమ అవధులు లేనిది, అభిప్రాయాలకు అందనిదని ట్వీట్ చేశారు.