HomeTelugu Newsయూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న అ ఆ

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న అ ఆ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అ ఆ’. త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ డ్రామాగా 2016 విడుదలైన ఈ సినిమా లో నితిన్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి హాల్‌చల్‌ చేస్తుంది. తెలుగులో హిట్‌ అయిన ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

4 30

ఆగస్టు 26న ‘అ ఆ’ చిత్ర హిందీ వర్షన్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోపే ఈ చిత్రం 20 మిలియన్ల వ్యూస్ చేరుకుని రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వేగంగా 10 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.

ఈ చిత్రంలో హీరో నితిన్‌ అయినప్పటికీ సినిమా ఎక్కువగా సమంత చూట్టూనే తిరుగుతుంది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్‌ను సమంత బాగా చూపించింది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ సమంత ఆకట్టుకుంఈ చిత్రానికి యూట్యూబ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందిది. చిత్రంలో చూపించిన పల్లె వాతావరణం, అందుకు తగ్గట్టుగా మిక్కి జె మేయర్ స్వరపరిచిన బాణీలు ఉత్తరాది సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu