HomeTelugu Newsమ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్‌ బ‌యోపిక్

మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్‌ బ‌యోపిక్

ఇప్పుడు బ‌యోపిక్ సినిమాల కాల‌మే న‌డుస్తుంది. భాష‌ల‌తో సంబంధం లేకుండా అటు నార్త్ , ఇటు సౌత్ ల‌తో బ‌యోపిక్
సినిమాలు వ‌రుస‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. క్రీడాకారుల జీవిత క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకొని తీస్తున్న
సినిమాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. క్రికెట‌ర్ల బ‌యోపిక్ సినిమాల‌కు వున్న క్రేజ్ ఎలా వుంటుందో
చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

10

మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, మ‌హేంద్ర ధోని, స‌చిన్ టెండూల్క‌ర్ జీవితాల ఆధారంగా ఇప్ప‌టికే బ‌యోపిక్ సినిమాలు వ‌చ్చాయి.
ఇవి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ప్ర‌స్తుతం క‌పిల్ దేవ్ జీవితాన్ని క‌బీర్ ఖాన్ వెండితెరపైకి తీసుకొస్తున్నాడు.
క‌పిల్ దేవ్ పాత్ర‌ను బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు. ఇదే స్ఫూర్తితో మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి
బ‌యోపిక్‌ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌ తెర‌కెక్కించబోతుంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ జుల‌న్ గోస్వామి క‌థ‌ను డెవ‌ల‌ప్
చేస్తోంది. స్క్రిప్ట్ పూర్తికాగానే దునామిస్ ఎంట‌ర్టైన్మెంట్ తో క‌ల‌సి ఈ సినిమాను నిర్మించేందుకు స‌న్న‌హాలు చేస్తోంది.

34 సంవ‌త్స‌రాల జుల‌న్ గోస్వామి అస్సాంలోని చ‌క్ ద‌హా ప్రాంతంలో జ‌న్మించింది. ఇక అంత‌ర్జాతీయ క్రికెట్లో 164 వ‌న్డేలు
ఆడిన జుల‌న్ 195 వికెట్లు ప‌డ‌గొట్టి, మ‌హిళ క్రికెట్లో అత్య‌ధిక వికెట్లు తీసిన తొలి మ‌హిళ క్రికెటర్ గా చ‌రిత్ర సృష్టించింది.
జుల‌న్ బ‌యోపిక్ కోసం అనేక పేర్లు ప‌రిశీలించిన త‌రువాత ఈ సినిమాకు చ‌క్ ద‌హా ఎక్స్ ప్రెస్ అనే పేరును నిర్ధారించిన‌ట్లు
తేలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu