HomeTelugu Newsమ‌రోసారి లీడ‌ర్‌గా రానా

మ‌రోసారి లీడ‌ర్‌గా రానా

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామ‌రావు జీవితం ఆధారం గా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. కొద్ది
రోజుల క్రితం లాంఛ‌నంగా ప్రారంభమైన ఈ ప్రోజెక్టునుంచి దర్శకుడు తేజ త‌ప్పుకున్నాడు. దీనివ‌ల్ల రెగ్యుల‌ర్ షూటింగ్‌కు
ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న క‌థనాల ప్ర‌కారం చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో
రానా కనిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

5 1
చిత్ర నిర్మాత‌లు రానా ద‌గ్గుబాటిని క‌లిసి కథ‌ను వివ‌రించగా … పాజిటివ్ గానే స్పందిచార‌ట రానా. ఈ వారంలో ఈ
విష‌యం పై అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం వుంది. అలాగే ఈ బయోపిక్ పై ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి
పుర‌స్క‌రించుకుని ఓ శుభ వార్త ప్ర‌క‌టించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి ఓ పెద్ద డైరెక్ట‌రును రంగంలోకి
దింపాల‌ని చూస్తున్నార‌ట‌. డైరెక్ట‌ర్ తేజ స్థానాన్ని భ‌ర్తీ చేసే వారు లేని ప‌క్షంలో బాల‌కృష్ణ దర్శకత్వ పగ్గాలు చేప‌ట్టే అవ‌కాశం
క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాల‌కృష్ణ న‌టిస్తుండ‌గా, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu