HomeTelugu Newsమెగా కాంపౌండ్ నుంచి మరో ''విజేత''

మెగా కాంపౌండ్ నుంచి మరో ”విజేత”

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నారు. చిరంజీవి కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వారాహి సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమాకు విజేత అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో విజేత ఒకటి. ది బెస్ట్ మూవీ కూడా. అప్పట్లో దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. మెగా హిట్ సాధించిన విజేత చిత్రమంటే చిరుకి కూడా చాలా ఇష్టం. అదే టైటిల్‌తో మెగా కౌంపాండ్‌ నుంచి వచ్చే హీరోతో మరో విజేత తెరకెక్కబోతుంది.

4 6

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి సారధ్యంలో రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ కొత్త హీరో కల్యాణ్‌దేవ్ పక్కన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎదుటివారి ముఖంలో నవ్వులు పూయించడం కూడా ఒక విజయమే అనే ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu