మెగాస్టార్ చిరంజీవి తరువాత చిత్రం కోసం కథనాయికగా అనుష్క.. త్రిషలతో పాటు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్‌ల పేర్లు కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే క్రేజ్ పరంగా చూసినా.. జోడి పరంగా చూసినా అనుష్క అయితేనే బాగుంటుందని భావించారు. అందువలన ఆమెను తీసుకోవడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైనట్టేనని అంటున్నారు.. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించవలసి వుంది. కాగా ఈ సినిమాను డిసెంబరులో మొదలుపెట్టనున్నాట్లు తెలుస్తుంది.