ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. పి.వి. మిథున్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో పి.వి. మిథున్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. పి.వి. మిథున్ గా లోక్ సభ సభ్యులకు సుపరిచితమైన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మిథున్ లండన్‌లోని స్కిల్లర్ విశ్వవిద్యాలయం నుండి MBA (ఇంటర్నేషనల్ బిజినెస్) పూర్తి చేశారు. మిథున్ రాజకీయాల్లోకి రాకముందు తమ కుటుంబానికి చెందిన పలు వ్యాపారాలను నిర్వహించేవారు. మిథున్ రెడ్డి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన పెద్ద తాత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఒక రాజకీయ దిగ్గజం.
పైగా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన దిగ్గజ రాజకీయ నాయకులు. మరియు ప్రస్తుతం విద్యుత్ , మైనింగ్, అటవీ మరియు సైన్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిథున్ రెడ్డి బాబాయ్ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే, మేనమామ రామచంద్రారెడ్డి పీలేరు ఎమ్మెల్యే . అలాగే తెలుగుదేశం పార్టీ రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గారు వీరికి బంధువులు. ఇలా మిథున్ రెడ్డి కుటుంబంలోనే ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు.
మిథున్ రెడ్డి కూడా తన తండ్రి స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి 2014, 2019 లలో రాజంపేట ఎంపీగా విజయం సాధించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా మిథున్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మిథున్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మిథున్ రెడ్డి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మిథున్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. మిథున్ రెడ్డి వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
జగన్ రెడ్డి లాంటి వ్యక్తి అనుచరుడిగా ఉంటూనే.. మిథున్ రెడ్డి తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. పైగా జగన్ కు విశ్వాస పాత్రుడని మిథున్ రెడ్డికి ముద్ర కూడా ఉంది. ఇక మిథున్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో అన్ని అనుకూలిస్తే ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో మిథున్ రెడ్డి పై అభిమానం ఉంది. ముఖ్యంగా రాజంపేట ఏరియాలో బలమైన ఫాలోయింగ్ ఉన్న నేతగా మిథున్ రెడ్డి రాణిస్తున్నారు. కాబట్టి.. మిథున్ రెడ్డి రాజంపేట తాలూకు నియో జకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది.