HomeTelugu Big Stories'మా' నిధులు దుర్వినియోగం పై స్పందించిన 'మా' అధ్యక్షుడు

‘మా’ నిధులు దుర్వినియోగం పై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో వివాదం తలెత్తింది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిపై స్పందించి ‘మా’ కార్యవర్గం ఈరోజు సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ హాజరయ్యారు.

5 2

సమావేశం అనంతరం శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసోసియేషన్‌లో 5పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని సవాల్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజ్‌ ఆక్షేపించాడు.

కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నాడు. మా అసోసియేషన్‌ జూబ్లీ ఇయర్‌ సందర్భంగా నూతన బిల్డింగ్‌ కట్టబోతున్నామని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu