మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గురువారం టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు మహర్షి టీజర్‌ను పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే ఐదు వేల మంది షేర్ చేశారు. మహేష్ ఫేస్బుక్ పేజీలోనే ఈ టీజర్‌ను 2 లక్షల మందికిపైగా వీక్షించారు. ఓ చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకుని స్టయిల్‌గా నడుచుకుంటూ వస్తూ.. జుట్టుపైకి వేళ్లతో దువ్వుతూ ఎదురొచ్చి వెళ్లిపోతున్న అమ్మాయిని వెనక్కి తిరిగి చూడటం రొమాంటిక్‌గా ఉంది. హాఫ్ హ్యాండ్స్ చెక్ షర్ట్, గడ్డంతో న్యూలుక్లో మహేష్ బాబు చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నాడు.
మహేష్‌బాబు తన గత ఏడెనిమిది సినిమాల నుంచి క్లాస్ లుక్‌లో మాత్రమే కనిపించినా తన 25వ సినిమా ‘మహర్షి’లో మాత్రం రఫ్ లుక్ ఉన్న స్టూడెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. క్లాస్ పాత్రకు మాస్ టచ్ ఇస్తూ, హీరోని మాస్, క్లాస్ రెండు వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే వంశీ పైడిపల్లి ఈ ‘మహర్షి’ సినిమాలో కూడ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ వాతావరణం ఔట్ అండ్ ఔట్ క్లాస్‌గా ఉంటే అందులో కొంచెం గడ్డంతో ఉన్న మాస్ మహేష్ కొత్తగా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.