డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(డీఎస్పీ) ధరలు పెంచడంతో తమకు ఆర్థికంగా ఎంతో భారం పడుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రేపటి నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ఆపేస్తామని ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శన ఉండవని వర్చువల్ ప్రింట్ ఫీస్ (వీపీఎఫ్) చార్జీలను రద్దు చేయాలని తాము ఎంతగా విన్నవించుకున్నా డిజిటల్ సేవల సంస్థలు నిరాకరించాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంపై పలుమార్లు సమావేశాలు జరిపినప్పటికీ డీఎస్పీలు మాత్రం తగ్గడం లేదు. మా కంటెంట్ తీసుకుని డిజిటల్ గా వాడుకుంటూనే.. మాపైనే పెత్తనం చెలాయిస్తున్నారనేది నిర్మాతల ఆరోపణలు. ప్రస్తుతం వర్చ్యువల్ ప్రింట్ ఫీజులో 25శాతం తగ్గించాలన్న డిమాండ్ ఉంది. కేవలం 9శాతం తగ్గింపునకు ఆయా సంస్థలు అంగీకరించాయి. ఇక నుంచి క్యూబ్-యూఎఫ్ వో లకు కంటెంట్ కూడా ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించారు.