నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడవ వారంలో ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా..
నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. రియల్ లైఫ్‌లో నేను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్ సేమ్ అలాగే ఉంటాయి. అలాగే సంపత్ కూతురిగా రకుల్ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత బాగా వారిద్దరి క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్‌గా హైలైట్ అవుతాయి. దేవి ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. తెలుగుదనం, నేటివిటీ గురించి కళ్యాణ్‌కి బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్ చేయం. ఒక పాట తప్ప సినిమా అంతా కంప్లీట్ అయింది. మే మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం” అన్నారు.
దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ వున్న కథ ఇది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ప్రేమ. ఫ్రెండ్‌షిప్ రిలేషన్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషన్ సీన్స్ ఎంత బాగుంటాయో, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే బాగుంటాయి. ఈ చిత్రంలో నాగచైతన్య పెర్ఫామెన్స్ కొత్త యాంగిల్‌లో చూస్తారు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా అత్యద్భుతంగా చేశారు. రకుల్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. బ్యూటిఫుల్ పర్ఫామెన్స్ చేసింది. జగపతిబాబుగారి లాంటి సీనియర్ యాక్టర్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. సెట్‌లో చాలా సరదాగా ఫన్నీగా వుంటారు ఆయన. అందరికీ నచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది” అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. ” కళ్యాణ్ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. నాన్న సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. ఈ చిత్రంలో ఎమోషన్స్, రిలేషన్స్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి” అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ.. ”చైతన్య నా కళ్ల ముందు పెరిగాడు. చై, నేను కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. మా ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్స్ ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మామూలుగా నాకు ఇరిటేషన్ ఎక్కువ. అలాంటిది నాకు ఇరిటేషన్ రాకుండా స్మూత్‌గా, కూల్‌గా వర్క్ చేశాడు కళ్యాణ్. సినిమాని బాగా తెరకెక్కించాడు. చాలా డిఫరెంట్ ఫిలిం” అన్నారు.
రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ”ఎప్పటి నుంచో ప్యూర్ లవ్‌స్టోరీ ఫిలిం చేయాలని వెయిట్ చేస్తున్నాను. కళ్యాణ్ ఈ స్టోరీ నెరేట్ చేయగానే బాగా ఎగ్జైట్ అయ్యాను. ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను అని ఎంతో ఇష్టపడి చేశాను. భ్రమరాంబ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయి నటించాను. సినిమా ఫినిష్ అయ్యాక ఇంకా భ్రమరాంబలాగే బిహేవ్ చేస్తున్నాను. అంతలా ఆ క్యారెక్టర్ నన్ను వెంటాడుతుంది” అన్నారు.