సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్వనిదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో కాలేజ్ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సమాచారం ఒకటి టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. పుట్టిన రోజు కానుకగా ఫస్టలుక్ విడుదల చేయడం కాయం అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను 2019 ఏప్రిల్ 5వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.