సూపర్ స్టార్ మహేష్ ‘బాబు భరత్’ అనే నేను చిత్రం తరువాత ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మహేష్ గడ్డం లుక్‌తో కనిపించనున్నారు. ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రోజును ఇంకా ప్రత్యేకంగా మలిచేందుకు మహేష్ తన కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఇక ఆ లోపు ఒక మ్యాన్ మేడ్ పోస్టర్‌ను సృష్టించేశారు. ఇది సాధరణ విషయమే కానీ.. దాని బ్యాగ్రౌండ్‌లో 43 భాషల్లో మహేష్‌కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు అభిమానులు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పడు మహేష్ 25వ చిత్రం కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.