HomeTelugu Newsమహేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన: నమ్రత

మహేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన: నమ్రత

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత శిరోద్కర్ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలం నుంచి మహేష్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఓసారి మహేష్‌ మాట్లాడుతూ.. తనకు హిందీ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని కానీ తనకు ఆసక్తి లేదని తెలిపారు. తాజాగా మహేష్‌ ముంబైలో కనిపించడంతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

4 15

తాజాగా ఈ వార్తలపై నమ్రత ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడారు. మహేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. యూరప్‌ ట్రిప్‌ ముగించుకుని వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 25వ సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం మహేశ్‌ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీంను కలవడానికే ముంబైలో ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకానీ ఏ బాలీవుడ్‌ నిర్మాతను కలవలేదని ఆమె వెల్లడించారు. మహేశ్‌ 25వ చిత్రాన్ని అశ్వనీదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ కాగా.. కామెడీ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu