HomeTelugu Newsమహానటి 16 వ రోజు కలెక్షన్స్‌

మహానటి 16 వ రోజు కలెక్షన్స్‌

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” చిత్రం అంచనాకు మించి విజయ ఢంకా మోగిస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్‌కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి చిత్రం మొదటి నుంచి అందరి ప్రశంసలు అందుకొంటోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన అద్భతమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 33కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఏరియాలవారీగా ఈ చిత్రం కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లకు లాబాలను తెచ్చిపెడుతోంది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.

2 8

16 రోజుల్లో మహానటి వసూళ్లు : నైజాం- 9.15 కోట్లు, సీడెడ్ – 1.95 కోట్లు, గుంటూరు -1.59 కోట్లు, కృష్ణా – 1 .85 కోట్లు, ఈస్ట్ – 1 .62 కోట్లు, వెస్ట్ – 1 .15 కోట్లు, నెల్లూరు – 0.57 కోట్లు, ఏపీ, తెలంగాణలో మొత్తం : 20.73 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.80 కోట్లు, ఓవర్సీస్ : 9.70 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా 33.23 కోట్లు వసూలు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu