చికాగో సెక్స్ రాకెట్‌పై ప్రతి రోజు ఆసక్తికరమైన వార్తలు వెలుగుచూస్తున్నాయి.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో బాంబ్ పేల్చింది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ వివాదంలో భాగంగా.. 36 మందితో కూడిన లిస్ట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసింది శ్రీరెడ్డి. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాకుండా ఇంచా చాలా మంది సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ఉన్నారంటూ పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి లీక్ చేసిన లిస్ట్‌లోపాపులర్ హీరోయిన్స్, యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లతో పాటు పురుషులు కూడా ఉండటం విశేషం.
ఈ లిస్ట్‌ను పోస్ట్ చేసిన అనంతరం ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో అమెరికా పోలీసులకు నేను నా సహకారం అందించాను. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేను ఈ పేర్లు బయట పెట్టడం వల్ల నాకు ఏమైనా కావచ్చు అయినా నాకు భయంలేదు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లు.. వాళ్లను ఉంచుకున్న పొలిటికల్ లీడర్స్ నన్ను చేయొచ్చని వెనకడుగు వేసేదాన్నైతే ఇలా మీ ముందుకు వచ్చే దాన్ని కాదు. గ్లామర్ ఫీల్డ్ పట్ల ఆసక్తి ఉండే వాళ్లు చేతిలో ఆఫర్స్ లేకపోవడంతో మేనేజర్స్ ఉచ్చులో పడుతున్నారు.
అక్కడకు వెళ్లిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వాళ్ల పాస్ పోర్ట్‌లను తీసేసుకుని.. వారితో బలవంతంగా ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనేటట్లు చేయడం, వాళ్ల ట్రిప్‌ను ఎక్స్‌టెన్షన్ చేయడం.. బట్టలు లేకుండా చేసి వాళ్ల ఫోటోలు వీడియోలు తీసి బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే బాధితులందర్నీ సాక్షులుగానే పరిగణించారు. నేను ఎప్పటి నుండో ఈ ఇష్యూ మీద పోరాడుతున్నా.. కాని టాలీవుడ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. పైగా నేనేదో టాలీవుడ్‌పై బురద జల్లినట్టుగా ‘మా’ అసోషియన్ వాళ్లు ప్రవర్తించారు. అయితే సెక్స్ రాకెట్ బయట పడిన తరువాత ఇప్పుడు మా అసోషియేషన్ వాళ్లు మాకు చెప్పకుండా ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు. సెక్స్ రాకెట్ ప్రధాన సూత్రధారి కిషన్ మోదుగు మూడితో తమకు ఎలాంటి సంబంధం లేదని అసలు ఆయనెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా మూర్ఖత్వం. శ్రీరాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద కోఆర్డినేటర్స్, మేనేజర్‌లు టచ్‌లో ఉన్నారు. వాళ్లు కోఆర్డినేట్ చేస్తేనే హీరోయిన్లు, మిగతా నటీ నటులు అప్రోజ్ అవుతున్నారు. శ్రీరాజ్‌కి పలువురు హీరోయిన్లు, హీరోలు, దర్శకులు, ప్రొడ్యుసర్లు టచ్‌లో ఉన్నారు.
టాలీవుడ్ పరువు పోతుందని ఇప్పుడు లబోదిబో అంటున్నారు. అమెరికాలో నిర్వహించే తానా, ఆటా, నాటా లాంటి ఈవెంట్ లకు వెళ్లేందుకు కొత్తవారికి అవకాశాలు ఇవ్వరు. వీళ్లను కాదని వెళ్తే అక్కడ సెక్యూరిటీని పట్టించుకోరు. నేను క్యాస్టింగ్ కౌచ్‌ను వెలుగులోకి తీసుకుని వస్తే.. ఈరోజు నన్ను ఎక్కడా కనిపించకుండా చేసింది మీడియా. ఇప్పుడు సెక్స్ రాకెట్ వివాదంలో కూడా ‘టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది కాని నన్ను ఎవరూ ముట్టుకోలేదు.. పట్టుకోలేదు.. నేను పతివ్రతను అని డబ్బా కొట్టుకునేవాళ్లను సెక్స్ రాకెట్ చర్చాకార్యక్రమాల్లో కూర్చోబెతున్నారు. నిజమైన బాధితులకు తెలుస్తుంది అక్కడ ఇబ్బందులు ఏమిటన్నది. వీళ్లకు ఏం తెలుస్తుంది. మీడియా ఎవర్నైతే ప్రమోట్ చేస్తుందో వాళ్లే సెక్స్ రాకెట్‌లో ఉన్నారు. మేకప్ వేసుకుని వచ్చే టాలీవుడ్ వాళ్లకేం తెలియదు అంటూ మేకప్ చేసే వాళ్లనే చర్చల్లో కూర్చోబెతున్నారు. అసలు నిజాన్ని దాచేస్తున్నారు. ఈ విషయంపై నేను మాట్లాడుతుంటే నేనే బట్టలు విప్పేశా కాబట్టి నాకు అర్హత లేదంటున్నారు.
సమస్యలు ఉన్నప్పుడు టాలీవుడ్ పెద్దలు బయటకు రారు. సమస్యను పరిష్కరించరు. దగ్గుబాటి సురేష్ బాబు లాంటి నిర్మాతలు వాళ్ల సినిమాల ప్రమోషన్ టైంలో బయటకు వస్తారు తప్ప ఇలాంటి ఇష్యూలపై స్పందించరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లను , చిన్న చిత్రాలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని ఎందుకు పరిష్కరించరు ‘శ్రీరెడ్డి తనదైన శైలిలో విరుచుకు పడుతూ ఫేస్ బుక్ ద్వారా సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. అయితే తనకు అలవాటైన పద్దతిలో ఎటువంటి ఆధారాలను మాత్రం బయటపెట్టలేకపోయింది.