అగ్రతారగా కొనసాగుతూనే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది మిల్కీ బూట్యీ తమన్నా. ‘జై లవ కుశ’ సినిమా లో తమన్నా చేసిన ‘స్వింగ్ జర’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన సంగతే. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకులు స్పెషల్ సాంగ్ అంటే ముందుగా తమన్నాకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా కన్నడలో హీరో యాష్ నటిస్తున్న ‘కెజిఎఫ్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ చిత్ర దర్శక నిర్మాతలు తమన్నాను సంప్రదించగా ఆమె అంగీకరం తెలుపాడం జరిగిపోయిందట. అయితే ఈ స్పెషల్ సాంగ్ ఈ బ్యూటీ భారీగానే పారితోషకం వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ పాట 1970 లో డా.రాజ్ కుమార్ చేసిన ‘పరోపకారి’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని పోలి ఉండనుంది. 70, 80 దశకాల్లో జరిగే ఈ సినిమా కథలో యాష్ రాక్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు.