విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ ను మొన్ననే సెట్స్ మీదకు తీసుకెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ చిత్రం ఎంటర్ టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు తాజాగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రీసెంట్ గానే ఒకే చెప్పాడు వేంకటేష్.
ఈ చిత్రంలో వెంకీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకు ముందు వెంకీ ఘర్షణ, బాబు బంగారం సినిమాల్లో ఖాకి డ్రెస్ లో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపిస్తూనే ఎంటర్ టైన్మెంట్ ప్రదానాశంగా రూపొందనుంది ఈ ప్రాజెక్టు. నానితో నేను లోకల్ సినిమా ద్వారా మంచి విజయం సాధించాడు త్రినాథ రావు నక్కిన. ఇక బాబీ దర్శకత్వంలో వెంకీ, నాగ చైతన్య వెంకీ మామ అనే మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.