HomeTelugu Newsభవిష్యత్తు ఎంతో అందంగా ఉండబోతోందని నా ప్రగాఢ విశ్వాసం: సుజానె ఖాన్

భవిష్యత్తు ఎంతో అందంగా ఉండబోతోందని నా ప్రగాఢ విశ్వాసం: సుజానె ఖాన్

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే తన జీవితంలో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. 43 ఏళ్ల సోనాలి బెంద్రే హైగ్రేడ్ మెటాస్టోటిక్ కేన్సర్ తో బాధపడుతోంది విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమె న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్..హృతిక్ రోషన్ మాజీ భార్య, సోనాలి బెస్ట్ ఫ్రెండ్ సుజానె ఖాన్ అక్కడికి వెళ్లి మరీ ఆమెను పరామర్శించింది. అయితే గత వారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్స్ సుజానె ఖాన్, గాయత్రి జోషిలతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన సోనాలి వాళ్లిద్దరు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగాలని చెప్పింది. ఇప్పుడు సుజానె ఖాన్ కూడా సోనాలి అండ్ ఫ్రెండ్స్ తో తీసుకున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెడుతూ సోనాలికి ఓ ఎమోషనల్ సందేశం రాసింది.

4 12

‘జీవితంలో ఎన్ని తుఫానులు చెలరేగినా మనం ఒకరి చేయి మరొకరం పట్టుకుని ఒడ్డుకు చేరతామని నాకు కచ్చితంగా తెలుసు. ప్రశ్నలతో నిండిన ఈ ప్రపంచంలో నీ దగ్గర నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంటుంది. భవిష్యత్తు ఎంతో అందంగా ఉండబోతోందని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే నేను దానిని నీతో కలిసి ప్రయాణించబోతున్నాన’ని సుజానె తన పోస్టులో రాసింది. తన అభిమానుల ప్రార్థనల కారణంగానే తన పరిస్థితి మెరుగవుతోందంటూ వారికి తన ధన్యవాదాలు తెలియజేసింది. ఇటీవలే సోనాలి బెంద్రే భర్త గోల్డీ కూడా సోనాలి చికిత్స కొనసాగుతోందని ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu