దర్శకుడు మారుతలితో కలిసి బుల్లితెర నటుడు ప్రభాకర్ డైరెక్టర్ చేస్తున్న సినిమా ‘బ్రాండ్ బాబు’. నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రభాకర్ కన్నడ హీరో సుమంత్ శైలేంద్రను హీరోగా పరిచయం చేస్తూ.. ఈ చిత్రాని తెరక్కెకిస్తున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్‌ను ఈ రోజు (గురువారం) ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధుల కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మారుతి స్టైల్లో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బ్రాండ్ బాబు స్పెషల్ ప్రీమియర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బ హీరోయిన్గా నటిస్తుంది.
ఇక ఈ కథ విషయానికి వస్తే.. డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ)తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్ (సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే కథలోని అంశం.
ఈ బ్రాంబ్ బాబు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరచయమైన సుమంత్ శైలేంద్ర నటన పరంగా తన సతా చాటుకున్నాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. ఈషా రెబ్బ పని మనిషి పాత్రలో ఒదిగిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సూపర్బ్‌గా అనిపించారు. ఈ సినిమాలో మురళీ శర్మ కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడుతన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదత్మకంగా మలిచాడు. దర్శకుడిగా ప్రభాకర్‌కు బ్రాండ్ బాబు బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి. తనదైనా టేకింగ్‌తో కథను ఆసక్తికరంగా తెరకెక్కించాడు మారుతి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో ఎలా ప్రవర్తిస్తారో బాగా చుపించాడు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. చివరిగా బ్రాండ్ బాబు చిత్రం ఎంటర్టైనర్గా ఉంటుంది.