HomeTelugu News'బ్రాండ్‌ బాబు' మూవీ రివ్యూ

‘బ్రాండ్‌ బాబు’ మూవీ రివ్యూ

దర్శకుడు మారుతి వరుజ విజయాలు సాధిస్తున్నాడు. ఈ చిత్రం మారుతినే స్వమంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్‌ చూపించుకున్నాడు. కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్రను హీరోగా హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర నటుడు ప్రభాకర్‌ దర్శకుడు. ఇప్పటికే నెక్ట్స్ నువ్వే సినిమాకి దర్శకత్వం వహించిన ప్రభాకర్‌ ఈ సినిమా ప్రభాకర్‌ ఈ సినిమతోనైనా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా..? డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్‌ శైలేంద్ర మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడా..?

4a

కథ: ఇక ఈ కథ విషయానికి వస్తే.. డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ)తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్‌ (సుమంత్‌ శైలేంద్ర), తన బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్‌ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్‌ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే కథలోని అంశం

4b

నటీనటులు : ఈ బ్రాంబ్‌ బాబుగా ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరచయమైన సుమంత్‌ శైలేంద్ర నటన పరంగా తన సతా చాటుకున్నాడు. రిచ్‌ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్‌ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్‌ కూడా బాగానే పండించాడు. ఈషా రెబ్బ పని మనిషి పాత్రలో ఒదిగిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సూపర్బ్‌గా అనిపించారు. ఈ సినిమాలో మురళీ శర్మ కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. మురళి శర్మ నటన అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. మొత్తనికి మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ ఈ సినిమాకు ప్లస్‌ అయ్యారు. పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు తగట్టుగా చేశారు.

విశ్లేషణ :
దర్శకుడిగా ఫుల్‌ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్‌ కథా కథనాలతో సినిమాను వినోదత్మకంగా మలిచాడు. బుల్లితెర నటుడు ప్రభాకర్‌ దర్శకుడిగా మొదటి సినిమా నెక్ట్స్‌ నువ్వే. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో ఈ చిత్రాని తెరకెక్కించాడు. దర్శకుడిగా ప్రభాకర్‌ తన మార్క్‌ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్లో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో ఎలా ప్రవర్తిస్తారో బాగా చుపించాడు. హీరోకు హీరోయిన్‌ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్‌ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు.

హైలైట్స్
కామెడీ
మురళీ శర్మ నటన
డ్రాబ్యాక్స్
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

చివరిగా : అంతగా ఆకట్టుకోలేకపోయింది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

సినిమా : బ్రాండ్‌ బాబు
నటీనటులు :సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ
దర్శకత్వం : ప్రభాకర్ పి
నిర్మాతలు : శైలేంద్ర బాబు
సంగీతం : జెబి

Recent Articles English

Gallery

Recent Articles Telugu

దర్శకుడు మారుతి వరుజ విజయాలు సాధిస్తున్నాడు. ఈ చిత్రం మారుతినే స్వమంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్‌ చూపించుకున్నాడు. కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్రను హీరోగా హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర నటుడు ప్రభాకర్‌ దర్శకుడు. ఇప్పటికే నెక్ట్స్ నువ్వే సినిమాకి దర్శకత్వం వహించిన ప్రభాకర్‌ ఈ సినిమా ప్రభాకర్‌ ఈ సినిమతోనైనా...'బ్రాండ్‌ బాబు' మూవీ రివ్యూ