HomeTelugu Newsబిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేటైన సంజనా

బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేటైన సంజనా

బిగ్‌బాస్‌-2 లో శని, ఆది వారాల్లో నాని సందడి చేశాడు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడాడు. ఈ రోజు ఫాదర్స్‌ డే సందర్భంగా కుటుంబ సభ్యులకు నాన్న ఫోటోలను ఇచ్చి వాళ్లలో ఎమోషన్‌ను బయటకు తీసుకొచ్చాడు. ఈ వారం కెప్టెన్‌గా సామ్రాట్‌ ఎంపికయ్యాడు. అయితే బిగ్‌బాస్‌-2లో మొదట ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ సంజనా. ఈమె ఎలిమినేట్‌ అయిన తరువాత స్టేజ్‌ మీద నానితో మాట్లాడుతూ.. తేజస్వీ.. నువ్వు పెద్ద తోపువు కాదు. నువ్వు స్టార్‌ అయితే అది బయట.. బిగ్‌బాస్‌ ఇంట్లో కాదు. బాబు గోగినేని కనిపించేంత మంచివాడు కాదు అని చెప్పింది. ఆమెకు బిగ్‌బాస్‌ ఇచ్చిన బిగ్‌ బాంబ్‌ను బాబు గోగినేనిపై విసిరింది.

9 5

బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు నాని ఈ వారం సర్‌ఫ్రైజ్‌ ఇచ్చారు…ఇంట్లోకి నందిని అనే కొత్త సభ్యురాలుని ఆహ్వానించారు. ఈమె త్వరలో హౌస్‌లోకి వెళ్లనుంది. ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో నటించారట. అసలు ఈమె ఫస్ట్‌ రోజే ఎంట్రీ ఇవ్వాలట. అయితే ఈమెకు యాక్సిడెంట్‌ కావడంతో కొంచెం ఆలస్యం అయిందట. అయితే ఈమె మాట్లాడుతూ..నేను చాలా ఇండిపెండెంట్‌గా ఉంటాను. నేను ఇప్పటి వరకూ ఎవరినీ లవ్‌ చేయలేదు..బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరితోనైనా లవ్‌లో పడొచ్చేమో అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu