HomeTelugu News'బిగ్‌బాస్‌' గొంతు ఇతనిదేనా?

‘బిగ్‌బాస్‌’ గొంతు ఇతనిదేనా?

తెలుగు టీవీషోల్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌ ‘బిగ్‌బాస్‌’. ఈ షో…సీజన్‌-1 గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో నిర్వాహకులు ఇటీవలే సీజన్‌-2 ప్రారంభించారు. కార్యక్రమంలో బాగా ఆకట్టుకొనే విషయాల్లో బిగ్‌బాస్‌ వాయిస్‌ ఒకటి. అయితే ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ ఎవరో ఎవరికీ తెలియదు. సీజన్‌ మారింది. కంటెస్టంట్లు మారిపోయారు. హోస్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థానంలో నేచురల్‌ స్టార్‌ నానీ వచ్చేశాడు. కానీ బిగ్‌బాస్‌ ఎవరు, గంభీరంగా ఉండే ఆ గొంతు ఎవరిదో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.

5 12

 

బిగ్‌బాస్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నది ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణ బిగ్‌బాస్‌గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ నిజం అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu