భారీ అంచనాల మధ్య విడుదల కానున్న బాహుబలి పార్ట్ 2 సినిమాను విడుదల కానివ్వమని హెచ్చరిస్తున్నారు కర్నాటకకు చెందిన కరవే సభ్యులు. బాహుబలి సినిమా ఘన విజయం సాధించిన తరువాత పార్ట్ 2 ఎప్పుడొస్తుందా..? అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేయడానికి అడ్డుపడతామని కార్ణాటక రాష్ట్ర వాదులు హెచ్చరికలు జారీ చేశారు. దీనంతటికీ కారణం ఎవరో కాదు.. కట్టప్పే. కట్టప్పకు సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటి.. అనుకుంటున్నారా..?
అసలు విషయంలోకి వస్తే.. గతంలో కావేరీ జల వివాదం సమయంలో కన్నడ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వ్యవహరించారు. కన్నడ సంఘాలను చులకనగా చూస్తూ సత్యరాజ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన ముఖ్య పాత్రలో నటించిన బాహుబలి2 సినిమాను కన్నడ ప్రాంతంలో విడుదల చేయడానికి వీళ్ళేదని అంటున్నారు ఆ రాష్ట్ర కరవే సభ్యులు. సత్యరాజ్ ఎప్పుడో కర్నాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే.. కరవే మాత్రం ఇప్పుడు బాహుబలి సినిమాకు అడ్డుపడడం చోద్యంగా మారింది. మరి ఈ విషయంపై బాహుబలి టీం ఎలా స్పందిస్తుందో.. చూడాలి!