HomeTelugu Newsబాలీవుడ్ లో కొత్త జంట!

బాలీవుడ్ లో కొత్త జంట!

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలకు కొదవేమీ లేదు. పెళ్లి సంగతి పక్కన పెడితే అక్కడ డేటింగ్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రేమించడం, కలిసి ఉండడం, నచ్చకపోతే విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా బాలీవుడ్ లో మరో కొత్త జంట డేటింగ్ మొదలుపెట్టిందని సమాచారం. ఆ జంట ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నటి అలియా భట్ అని తెలుస్తోంది. ఈ విషయాన్నీ సోనాక్షి సిన్హా, డిజైనర్ మనీష్ మల్హోత్రా వెల్లడించారు. ఇటీవల ఓ కార్యకమానికి అతిథులుగా హాజరైన వీరిద్దరూ రణబీర్, అలియా ఈ ఏడాదిలో ఒక అండర్ స్టాండింగ్ కి వస్తారని.. రణబీర్ కోసం అలియా ఓ సినిమా ఆఫర్ కూడా వదులుకుందని అన్నారు.

alia 1నిన్నమొన్నటివరకు రణబీర్ ఓ పాకిస్థానీ నటితో ఎఫైర్ సాగిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరూ మంచి స్నేహితులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు రణబీర్, అలియా ప్రేమించుకుంటున్నారనేది తాజా వార్త. త్వరలోనే వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా కూడా చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu